పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ టి.లక్ష్మీపూర్ గ్రామానికి ఆశా వర్కరు పదవి ఒకటి ఖాళీగా ఉందని అధికారులు ప్రకటించారు. ఆశా వర్కరు ఒక్క పోస్టు కోసం మోహనా మెడికల్ ఆఫీసర్ వద్ద కుమ్ములాట సాగింది. ఈ ఉద్యోగం కోసం పాణిగండ పంచాయతీ టి.లక్ష్మీపూర్ గ్రామం నుంచి మమ తా నాయక్, శ్రీమంజలి మల్లిక్ అనే ఇద్దరు మహిళ లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మమతా నాయక్ స్థానికేతర అభ్యర్థి అని, లక్ష్మీపురం గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోహన మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. కటక్‌కు చెందిన మమ తా నాయక్ టి.లక్ష్మీపూర్‌లో ఇటీవల వచ్చి నివాసం ఉంటోందని, ఆమె స్థానికేతర మహిళ అని సర్పంచు, వార్డుమెంబరు ప్రణతి బలియార్ సింగ్, గ్రామ అభివృద్ధి కమిటీ ఇవ్వాలని గురువారం మోహనా మెడికల్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆశా వర్కరు పోస్టుకు ఆర్హతపై ఉన్నతాధికారులు ఎంపిక చేస్తార ని మెడికల్ ఆఫీసర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment