మహిళలకు ముగ్గుల పోటీలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఇడితాల్ పేరిట నిర్వహిస్తున్న చైతీ ఉత్సవాల్లో భాగంగా మహిళల మధ్య శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో సాగరిక శతపతి ప్రథమ బహుమతి, స్వాతి బౌరి ద్వితీయ, బిరాజని సబర్ తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. అదేవిధంగా మ్యూజికల్ చైర్ పోటీలు కూడా జరిగాయి. సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహాట పోటీలను ప్రారంభించారు. ఈ ఏడాది వర్షాలు కారణంగా చైతీ ఉత్సవాల్లో కొంత ఇబ్బంది ఎదురయ్యిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment