కొట్‌పాడ్ చేనేత కార్మికులపై అధ్యయనం
జయపురం: నేత వస్త్రాలకు పేరుగాంచిన జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితిలో సునారబెలి నువాగాం గ్రామ పంచాయతీ డొంగరగుడ గ్రామంలో చేనేత పనివారిని శనివారం రాష్ట్ర పర్యాటక విభాగ కార్యదర్శి బొలబంత సంగ్ కలిశారు. ఆ గ్రామంలో చేనేత కార్మికుల ఉమ్మడి సంక్షేమ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బొలబంత సింగ్‌కు గ్రామస్తులు పూల మాలలు వేసి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అక్కడి టెక్స్‌టైల్స్ కోఆపరేటివ్ వీవింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. నేత కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్, కొట్‌పాడ్ బీడీఓ బిక్రమ దొర, తహసీల్దార్ మహంతి నీలకంఠం నాయుడు, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి ఖగేశ్వర జెన, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర భొత్ర, మనోజ్ భొత్ర, ప్రభుత్వ ఇంజినీర్ సంతోష్ బాగ్ సింగ్, బినాయక ఆచార్య, సునారబెలి నువాగా సర్పంచ్, దేవ మఝి,సమితి సభ్యులు దేవీ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment