చివరికిలా..!
–8లోu
మంగళవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
కళ్లాల్లో ధాన్యం ఆరబెడుతున్న రైతులు
బాగుసల గ్రామం వద్ద బురదలోనే ధాన్యం
పర్లాకిమిడి : అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. పశ్చిమ కేంద్ర బంగాళాఖాతంలో ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐ.ఎం.డి.) అధికారి ఉమాకాంత దాస్ ప్రకటిస్తూ గజపతి జిల్లాకు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. దీంతో గుసాని, గుమ్మా, కాశీనగర్ తదితర ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అగరఖండి, కత్తల కవిటి, కోర్సండ గ్రామస్తులు ఇటీవల కలెక్టరేట్‌కు చేరుకుని మండీలను వెంటనే తెరిచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చాలా గ్రామాల్లో ధాన్యం నిల్వచేయడానికి సౌకర్యం లేనందున ఆరబయటే ఎండబెట్టిడుతున్నారు. డిసెంబరు 19, 20, 21న వరుస వర్షాలతో కోసిన వరిపంట ఇంకా పొలాల్లోనే ఉంది. ఎండ లేనందున తడిసిన ధాన్యాన్ని రోడ్డుపైకి తెచ్చి ఆరబెడుతున్నారు. ఉప్పలాడ, లింగుపురం గురండి, గుసాని రోడ్డులో సోమవారం ఇలా రహదారులపై ధాన్యం ఆరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రభుత్వం ఈ నెల 30 నుంచి మండీ ప్రారంభిస్తామని ఆర్.ఎం.సి.సెక్రటరీ ద్వారా ప్రకటించిందని, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని బీజేపీ కృషి మోర్చా అధ్యక్షుడు ప్రశాంతకుమార్ పాలో డిమాండ్ చేశారు. మబ్బులు, వర్షాలతో రైతులకు కోలుకోని దెబ్బ తగిలిందని, ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో రైతుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రైతు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పట్నాయిక్ కోరారు.
న్యూస్‌రీల్
ఎడతెరిపి లేని వర్షాలతో కోలుకోలేని
రైతులకు కోలుకోలేని దెబ్బ
ధాన్యం ఎండబెట్టేందుకు తప్పని పాట్లు
తాజాగా అల్పపీడనం హెచ్చరికలతో
ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment