రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
పర్లాకిమిడి:
అకాల వర్షాలకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గుసాని సమితిలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలకు ధాన్యం పొలాల్లోనే తడిసి రంగుమారి మొలకెత్తాయి. దీంతో జిల్లాలోని గుసాని సమితి బాగుసల పంచాయతీ రైతులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రా న్ని మంగళవారం అందజేశారు. అకాల వర్షాలకు పొలాల్లో ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చాయి. అందువల్ల రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చేయాలని జిల్లా కృషక్ మోర్చా అధ్యక్షులు (బీజేపీ) ప్రశాంత్ కుమార్ పాలో డిమాండ్ చేస్తున్నారు. బాగుసల పంచాయతీలో రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, రంగుమారిన ధాన్యం కోనుగోలు చేయాలని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు (గుసాని సమితి) జి.శ్రీధర నాయుడు కలెక్టర్ బిజయ కుమార్ దాస్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment