కేంద్రమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలి
రాయగడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ రాయగడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు రామచంద్ర కడమ్, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, బిసంకటక్ ఎంఎల్‌ఏ నీలమాధవ హికక, గుణుపూర్ ఎంఎల్‌ఏ సత్యజీత్ గొమాంగో, పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండ, అస్లామ్ ఖాన్, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక కొత్త బస్టాండు వద్ద గల బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన అనంతరం అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. భారత రాష్ట్రపతి పేరిట వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారికి సమర్పించారు.
కాంగ్రెస్ నాయకుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment