రాయగడ చైతీకి రంగం సిద్ధం
రాయగడ:
స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న జిల్లా స్థాయి చైతీ ఉత్సవాలకు రాయగడ పట్టణం ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రులు ప్రబాతి పొరిడ, కనకవర్ధన్ సింగ్ దేవ్, మంత్రులు నిత్యానంద గొండ, సురేష్ పూజారి తదితరులు ఉత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల మైదానంలో 376 స్టాల్స్ ఏర్పాటుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. శాంతిభద్రతలను పరివేక్షించేందుకు పోలీసులు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి వేదికను ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా రూపుదిద్దుకుంటోంది. ఎల్‌ఈడీ వెలుగులకు బదులు స్థానిక కళాకారులతో ప్రత్యేకంగా కుడ్య చిత్రాలు వేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment