పోటీతత్వం పెరగాలి
విద్యార్థుల్లో
● సెన్ ఫెస్ట్ –14.0 కార్యక్రమంలో
జేకేపేపర్ మిల్ ఉపాధ్యక్షులు ద్వివేది
రాయగడ: విద్యార్థుల్లో పోటీత్వంపెరగాలని.. అప్పుడే వారు చదువుతోపాటు ఇతర రంగాల్లో రాణించగలరని జేకే పేపర్ మిల్ ఉపాధ్యక్షులు (వాణిజ్యం) విశ్వజిత్ ద్వివేది అన్నారు. స్థానిక పితామహాల్‌లోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో సెన్‌ఫెస్ట్ –14.0 పేరిట సొమవారం సాయంత్రం జరిగిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా ఆసక్తి కనబరచగలిగితే వారి భవిషత్ ఉజ్వలంగా మారుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధార పడి ఉంటుందన్నారు. వారు సరైన మార్గంలో పిల్లలను నడిపించాలని అన్నారు. విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి మాట్లాడుతూ.. ఏటా విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ సెంచూరియన్ స్కూళ్లలో వార్షికోత్సవాలను జరుపుతామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులను ప్రొత్సాహించే విధంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గౌరవ అతిథిగా హాజరైన జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భ జన్ లాల్ మాఝి మాట్లాడుతూ.. పుట్టగొడుగుల్లా విద్యాసంస్థలు పెరుగుతున్నాయని అన్నారు. స్మార్ట్ తరగతులను నిర్వహించడంతో విద్యార్థులు చురుగ్గా చదువుకోగలుగుతున్నారని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పిస్తున్నారని అన్నారు. వ్యాపారపరంగా కాకుండా విద్యార్థుఽల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు బోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత, కవి సుశాంత్ కుమార్ నాయక్, విశ్వవిద్యాలయం అధ్యక్షులు రాధా క్రిష్ణ మహాపాత్రొ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment