జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రక్తనిధి
జయపురం: జయపురం ఫూల్‌బెడలో గల కొరాపుట్ జిల్లా కేంద్ర హాస్పిటల్‌లో ఎట్టకేలకు రక్తనిధి కేంద్రం గురువారం నెలకొల్పారు. ఇప్పటివరకు జిల్లా కేంద్ర హాస్పిటల్‌కు వచ్చే రోగులు రక్త పరీక్షలకు తమకు అవసరమైన గ్రూప్ రక్తం కోసం హాస్పిటల్ నుంచి 4 కిలో మీటర్ల దూరంలో గల పాత సబ్‌డివిజన్ హాస్పిటల్ కు పరుగులు తీయాల్సి వచ్చింది. రోగుల బంధువులు రక్తం కోసం పలు ఇక్కట్లు పడ్టారు. గురువారం నుంచి జిల్లా కేంద్రం హాస్పిటల్‌లోనే అవసరమైన రక్తం లభించగలదని రోగులు, వారి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి రూ.142 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా కేంద్ర హాస్పిటల్ భవనాలను ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేసిన విషయం విధితమే ఆ భవనాలలో మొదటి అంతస్తులో రక్త నిధిని ప్రారంభించారు. 12 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. జిల్లా కేంద్ర హాస్పిటల్‌లో 15 గదులు రక్త నిధిని కేటాయించారు. వాటిలో రక్త సంగ్రహ కేంద్రం, రక్త సంరక్షణ, రక్త దాతల విశ్రాంతి గృహం, వైటింగ్ హాల్, అధికారుల కోసం ఒక ప్రత్యేక గది, ఏర్పాటు చేయబడింది. ఒక అధికారితోపాటు నలుగురు లేబ్ టెక్నీషియన్లు, నలుగురు అటెండర్లు, ఇద్దరు స్టాఫ్‌నర్స్‌లను నియమించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment