ఉత్తమ జ్యోతిష్య శాస్త్రవేత్తకు ఘన సన్మానం
జయపురం: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియబాద్ శివశంకర జ్యోతిష్ శాస్త్ర, వాస్తు అనుసంధాన కేంద్రం వారు గత రెండు రోజులలో జాతీయ జ్యోతిష్య శాస్త్రం, వాస్తు సెమినార్ నిర్వహించారు. ప్రసిద్ధ జ్యోతిష్య శాస్త్ర విశారద, పండితులు ఈ సెమినార్‌లో పాల్గొన్నారు. సెమినార్‌లో ఒడిశా తరఫున పాల్గొన్నవారిని ఉత్తమ జ్యోతిష్య శాస్త్రవేత్తగా సన్మానించారు. సెమినార్‌లో నాడి, పంచతంత్ర, వాస్తు, జ్యోతిష్ శ్రాస్తంపై పరిశోనార్థకంగా ఆధారాలతో ప్రసంగించిన ఆచార్య భగీరఽథ బిందానిని ప్రసంశిస్తూ ఆచార్య పదవితో సన్మానించారు. సెమినార్‌లో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి 550 మంది వాస్తు, జ్యోతీష్కులు పాల్గొన్నారు. బ్రజ మండల్ జీవణ దర్శన్ అనే పుస్తకం ఆవిష్కరింపజేశారు. సమగ్ర భారత దేఽశంలో జ్యోతిష్ శాస్త్ర విశాదలు, పండితులు పాల్గొన్న సెమినార్‌లో జ్యోతిష్ శాస్త్రం, వాస్తు, మొదలగు విషయాలపై చర్చించారు. ప్రముఖ సమాజ సేవి రాజేష్ బనసాలి అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో ప్రత్యేక అతిథిగా రామ్‌అవతార్ జిందాల్, అనిల్ గర్గ్, పండిత బి.కె.హనుమాన్, రాష్ట్రీయ లోక్‌దల్ రాష్ట్ర సాధారణ కార్యదర్శి రవీంద్ర చౌహన్, జాతీయ ముఖపత్ర ఇందిరజిత్ సింగ్, టిటు సందీప్ భండారి, రాకేష్ గర్గ్, పలుగురు ప్రముఖలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment