ఆలోచింపజేసిన ‘జీవనం–ఒక నాటకం’
జయపురం: బరంపురం గిరి మార్కెట్‌లోని ప్రకాశం హాల్‌లో జరుగుతున్న ఎనిమిదవ రాష్ట్రస్థాయి 34వ దక్షిణ నాటక మహోత్సవాలు 2025 ఉత్సహంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జయపురం నిర్జరాణి నాటక కళాకారులు ప్రదర్శించిన ’జీవనం–ఒక నాటకం’ నాటిక ప్రేక్షకులను ఆలోజింపజేసింది. మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు జీవితం ఒక నాటక మయం, సుఖ దుఃఖాలలో, జీవన శైలిలో పలు పాత్రలలో మనిషి నటిస్తాడనే సందేశాన్ని కళాకారులు తన ప్రదర్శన ద్వారా తెలియజేశారు. రచయిత జగదీష్ అధికారి మనిషి జీవిత గమనాన్ని చక్కగా తెలియజేశారు. నిరంజన్ పాణిగ్రహి దర్శకత్వంలో అభినాష్‌గా పంచానన మిశ్ర, బపిగా అశోక్ మహరాణ, మాలతిగా విజయ పాణిగ్రహి, రాజుగా విఘ్నరాజ్ ఆచారి, రవిగా నిరంజన్ పాణిగ్రహి, జితుగా పవిత్ర మల్లిక్‌లు తమతమ పాత్రలలో జీవించి ప్రేక్షకులను మెప్పించారు. కళాకారులు యుగల సాహు, సమర్పిత పాణిగ్రహిలు తమ నటనలతో ప్రేక్షకుల మన్ననలను పొందారు. మానవ జీవితానికి అద్దం పట్టే జీవనం–ఒక నాటకం’ నాటకానికి రామనిగం మహంతి సంగీతం సమకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment