కొరాపుట్: దివ్యాంగుల పరిరక్షణకు అనేక చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కొరాపుట్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వేణుధర్ అన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ కళాశాల ఆవరణలో దివ్యాంగుల చట్టం–2016పై జరిగిన బుధవారం అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. చట్టాల అమలు కోసం అన్ని శాఖల అధికారులు బాధ్యత వహించాలన్నారు. అవగాహన పొందిన దివ్యాంగులు కూడా ఈ వివరాలు సాటి దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా కేంద్ర ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఖటువా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి పుష్పాంజలి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 14 సమితులు, నాలుగు పురపాలక సంఘాల నుంచి దివ్యాంగులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment