విద్యార్థినితో అనుచిత ప్రవర్తన
భువనేశ్వర్: సహాయం చేస్తానని మభ్యపెట్టి విద్యా ర్థినితో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణ కింద రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్) సహాయ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)ని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పి) బుధవారం భువనేశ్వర్‌లో అరెస్టు చేశారు. నిందితుడు ఏఎస్‌ఐ నిరంజన్ జెనాగా గుర్తించారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ ఠాణాలో బాధిత బాలిక చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏఎస్‌ఐని అరెస్టు చేశారు. జగత్‌సింగ్‌పూర్ నుంచి వచ్చిన విద్యార్థిని సోమవారం భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌లో రైలు దిగింది. ఆమె హాస్టల్ మూసివేయడంతో సాయం కోసం రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై రైల్వే పోలీసులను ఆశ్రయించింది. ఈమె నిస్సహాయ స్థితిని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో అనుచిత ప్రవర్తనకు తలపడ్డాడు. ఒంటరిగా ఉన్న బాలిక తలదాచుకునేందుకు ఆశ్రయం కల్పిస్తానని తన గదికి తీసకెళ్లి అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడు. అతని వద్ద నుంచి బయటపడిన బాధిత బాలిక రైల్వే స్టేషనులో ప్రభుత్వ రైల్వే పోలీసుల్ని సంప్రదించడంతో నిందిత ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐని జీఆర్‌ఎపీ అరెస్టు చేశారు.
ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment