పర్లాకిమిడిలో ప్రవాస భారతీయ దివస్
పర్లాకిమిడి: తల్లిదండ్రుల సహకారం లేనిదే విదేశాలలో ఉన్నత చదువులు, స్థిరపడలేమని అమెరికా ప్రవాస భారతీయుడు, వర్జినియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ రోషన్ నాయక్ అన్నారు. స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని కామన్ వెల్త్‌బ్యాంక్ ప్రొడక్ట్ మేనేజరుగా పనిచేస్తున్న సంతోష్ పాణిగ్రాహి, వర్జినియా వర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసరు రోషన్ నాయక్‌లను కలెక్టర్ దాస్ దుశ్శాలువతో సత్కరించారు. అనంతరం ప్రవాస భారతీయులు ఒడియా భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. వీసా, ఇతర సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, డీఆర్‌డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి గుణనిధి నాయక్, డీఈఓ మాయాధర్ నాయక్, హెచ్‌ఎంమోనాలిసా దాస్, గుసాని బ్లాక్ విద్యాధికారి టి.కిషోర్, ఉపాధ్యాయులు జగన్నాధ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment