వంశధార వసంతోత్సవాలు ప్రారంభం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వ తేదీ వరకు జరగనున్న వంశధార వసంతోత్సవాల్లొ భాగంగా ఆదివారం నుంచి మెగా క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. సేవాసమాజ్ సమీపంలో గల మైదానంలో గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ ముఖ్యఅతిఽథిగా హాజరై క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా వంశధార వసంతోత్సవాలను నిర్వహిస్తుండడం ఆనందదాయకమన్నారు. అంతకు ముందు గుణుపూర్ మా మంగళ మందిరం నుంచి క్రీడా మైదాన వేదిక వరకు భారీ ర్యాలీ జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర రైతా, మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడొ, వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడొ, జీఐఈటీ ఉపాధ్యక్షులు డాక్టర్ చంద్ర ధ్వజ పండ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment