ఆదివాసీ రాణి.. జ్యోతి
జయపురం: భువనేశ్వర్‌లో రమాదేవి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ట్రైబల్ గ్లోబల్ ఫెస్ట్‌లో కొరాపుట్ జిల్లా గిరిజన మహిళ జ్యోతి పూజారి ప్రతిభ చాటింది. ఒడిశా ఆదివాసీ రాణి పోటీల్లో అవిభక్త కొరాపుట్ జిల్లా నుంచి 10 మందితో పాటు 25 మంది ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు. వారిలో జయపురం సబ్ డివిజన్ ఆదివాసీ మహిళ జ్యోతి పూజారి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర ఆదివాసీ రాణి కిరీటం సాధించింది. జ్యోతి పూజారి తన చిన్నతనంలోనే తల్లి దండ్రులను కోల్పోయింది. జయపురం పారాబెడలో గల తన పిన్ని ఇంటిలో ఉంటూ +2 చదువుతోంది. 2016లో జ్యోతి మెట్రిక్‌లో ఉత్తీర్ణురాలు అయినా కుటుంబ పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేకపోయింది. దీంతో పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేస్తూ వచ్చిన డబ్బుతో తన పిన్ని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచింది. ఇదే పోటీలో మల్కన్‌గిరి జిల్లా ఖొయిర్‌పుట్ బోండా యువతి బొడొనాయిక్ రన్నర్‌గా నిలిచింది. అలాగే ఆదివాసీ అలంకరణలో మల్కనగిరి జిల్లా ధరమపల్లి కోయ ఆదివాసీ సంప్రదాయ యువతి సొనాలి పొడియామి గెలుపొందింది. కొరాపుట్ జిల్లా జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి నువాగుడ గ్రామం హీరా హరిజన్ ఆభరణాల అలంకరణలో రెండో స్థానం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment