ఇంద్రావతి–భువనేశ్వర్, భవానీ పట్న–అయోధ్య బస్సులు ప్రారం
కొరాపుట్: సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఓఎస్‌ఆర్‌టీసీ నూతన బస్సుల సర్వీసులు ప్రారంభించింది. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా ఇంధ్రావతి నుంచి భువనేశ్వర్‌కి బస్సు ప్రారంభించింది. ఈ బస్సు ప్రతి రోజు రాత్రి 10.30 కి ఇంద్రావతి నుంచి బయల్దేరి నబరంగ్‌పూర్, పపడాహండి, భవానీపట్న మీదుగా భువనేశ్వర్ చేరుతుంది. అదే విధంగా తిరుగు ప్రయాణం చేస్తుంది. నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి జెండా ఊపి ఈ బస్సు ప్రారంభించారు. మరో వైపు పక్కనే ఉన్న కలహండి జిల్లా భవానీ పట్న నుంచి కుంభ మేళా కోసం ప్రత్యేక బస్సు ప్రారంభించారు. ఈ బస్సు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వీసుని మహా శివరాత్రి వరకు నడపనున్నారు. భవాని పట్న నుంచి అయెధ్య, వారణాశి, ప్రయాగ్ రాజ్‌లకు ఈ సర్వీసు ఉంది. ఒక వైపు టిక్కెట్ ధర రు.2,449 గా నిర్ణయించారు. ఈ రెండు సర్వీసులు ఓల్వో బస్సులు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment