నేటి నుంచి రాజభవన్ సందర్శనకు అనుమతి
భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్ ఉద్యానం సందర్శనకు సాధారణ ప్రజానీకానికి ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు అధికారులు అనుమతి ఇచ్చారు. సువిశాలమైన రాజ్‌భవన్‌ను విస్తరించిన నేపథ్యంలో సందర్శనకు ఇదో మంచి అవకాశం. – భువనేశ్వర్
పతిత పావనుని కుడ్య
గోపురానికి వెండి తాపడం
పూరీ శ్రీ జగన్నాథ దేవస్థానం సింహ ద్వారం ప్రాంగణంలో నిత్య పూజలు అందుకుంటున్న పతిత పావనుడు కుడ్య ప్రతిమ గోపురం సరికొత్త కళతో తళతళలాడుతుంది. సింహ ద్వారం ఆవరణ వెండి తాపడం పనుల్లో భాగంగా పతిత పావనునికి కొత్త రూపు దిద్దారు. – భువనేశ్వర్
కలిమెలలో మావోల డంప్ స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధిలోని జినేల్‌గూఢ అటటీ ప్రాంతంలో ఆదివారం ఉదయం మావోయిస్టుకు చెందిన డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో డీఆర్‌జీ జవాన్లకు డంప్ తారసపడింది. డంప్‌ను స్వాధీనం చేసుకున్న జవాన్లు జిల్లా ఎస్‌పీ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. యం.వి.79 పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్తాన్‌పల్లి, మేటగూఢ గ్రామ ప్రాంతాల మీదుగా జవాన్లు మోటు ప్రాంతాంలో జినాల్‌గూఢ అడవిలో కూంబింగ్‌కు శనివారం రాత్రి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగి వస్తున్న డీఆర్‌జీ జవాన్లు డంప్‌ను గుర్తించి వెలికితీసి అందులో ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్ బుల్లెట్లు, 50 చిన్న ఎస్‌ఎల్‌ఆర్ బుల్లెట్లు, నాలుగు చార్జ్‌ర్లు, మావోయిస్టు యునిఫారాలు, మావో సాహిత్యం, టార్చిలైట్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకొని జిల్లా ఎస్‌పీ వివేకానంద ఎదుట.. విలేకరుల సమక్షంలో ప్రవేశపెటారు. సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లను అభినందిచారు.
Comments
Please login to add a commentAdd a comment