250 మందికి వైద్య పరీక్షలు
జయపురం: జయపురం హటపొదర్ ప్రాంతంలో ఆయుస్మాన్ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 250 మంది రోగులకు వైద్య పరీక్షలు జరిపి మందులు అందజేశారు. డాక్టర్ సురేష్ పాణిగ్రహి, డాక్టర్ సిద్ధాంత నాయిక్, డాక్టర్ శుభం మహాపాత్రోలు రోగులకు పరీక్షలు చేశారు. కార్యక్రమంలో అంటువ్యాధులు, వైరల్ ఫీవర్, మలేరియా వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
15 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం
రాయగడ: జిల్లాలోని గుడారిలో గంజాయి సాగవుతున్న ప్రాంతాన్ని డ్రోన్ ద్వారా జిల్లా పోలీసులు గుర్తించారు. దీంతో ఆదివారం గుడారి పరిధిలోని కతిలి అటవీ ప్రాంతంలో దాడులను నిర్వహించి 15 ఎకరాల విస్తీర్ణంలొ సాగవుతున్న 45 వేల గంజాయి మొక్కలను సిబ్బంది ధ్వంసం చేసిన అనంతరం వాటిని తగుల బెట్టారు. కొద్ది నెలలుగా జిల్లా పోలీస్ యంత్రాంగం గంజాయి అక్రమ రవాణా, సాగుపై ఉక్కుపాదం మోపింది.
Comments
Please login to add a commentAdd a comment