No Headline
జయపురం: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జీవికా మిషన్ ఈసీ సంఘం ప్రతినిధులు కోరారు. లేని పక్షంలో ఈ నెల 24వ తేదీన కొరాపుట్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు. స్థానిక కార్మిక భవనంలో అఖిల ఒడిశా జీవికా మిషన్ ఈసీ సంఘం కొరాపుట్ జిల్లా శాఖ అత్యవసర సమావేశాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షురాలు జ్యోతీరేఖ భట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఒడిశా రాష్ట్ర కార్యదర్శి, అఖిల ఒడిశా జీవికా మిషన్ ఈసీ సంఘ అధ్యక్షుడు జయంతి దాస్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 70 లక్షల మిషన్ శక్తి మహిళా సభ్యుల్లో ఒక లక్ష 35 వేల మందిని ఈసీ సభ్యులుగా గత ప్రభుత్వం వేరు చేసిందన్నార. వారికి నేటి వరకు ఉద్యోగులుగా గుర్తింపు లభించలేదని వెల్లడించారు. మిశన్ శక్తి ఆధీనంలో పనిచేస్తున్న ఈసీలకు ట్రావెలింగ్ కోసం గతంలో రూ. 1500 ఇస్తుండేదని.. అయితే గత సెప్టెంబర్ నుంచి నిలిపి వేసిందన్నారు. ఈసీ రిజిస్ట్రేషన్ (పునర్ఘటన) పేరుతో తమ పార్టీ వారిని నియమించే అభిప్రాయంతో బీజేపీ ప్రభుత్వం పథకం వేస్తోందని ఆరోపించారు. అందుకు రహస్య పథకం రూపొందిస్తుందన్నారు. సామాజిక సురక్షా పథకంలో ఈపీఎణ, ఈఎస్‌ఆర్ తదితర కనీస సైకర్యాలు కల్పించలేదని దుయ్యబట్టారు. జీవిక మిషన్ ఈసీలకు ఈపీఎఫ్, ఈఎస్‌ఆర్ సౌకర్యం కల్పించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ వయసు 65 ఏళ్లకు పెంచాలనే డిమాండ్లతో కలెక్టరేట్‌ను ముట్డడిస్తామన్నారు. అలాగే అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన వంటవారిని, వారి సహాయకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని దాస్ వెల్లడించారు. సమావేశంలో పూర్ణిమా రౌత్, సబితా జాని, బిమళ భొత్ర, ధనిత్రి గొలారి, చంచల హరిజన్, మాధురి బిడిక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment