రెండోరోజు పోస్టల్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

రెండోరోజు పోస్టల్‌ ఓటింగ్‌

Published Tue, May 7 2024 11:30 AM

రెండోరోజు పోస్టల్‌ ఓటింగ్‌

83.34 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

నియోజకవర్గం మొత్తం 6వ తేదీన రెండురోజుల మొత్తం

ఓట్లు పోలైన వ్యవధిలో శాతం

ఓట్లు పోలైన ఓట్లు

పెదకూరపాడు 1929 718 1682 87.26

చిలకలూరిపేట 2207 688 1907 86.41

నరసరావుపేట 2859 1086 2424 84.78

సత్తెనపల్లి 2303 605 1843 80.03

వినుకొండ 2373 695 2050 86,39

గురజాల 2338 894 1804 77.16

మాచర్ల 2273 791 1811 79.67

మొత్తం 16,286 5477 13521 83,34

నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు అందరికీ ఓటుహక్కు కల్పించేందుకు మూడురోజుల పాటు ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా రెండురోజుల వ్యవధిలో 83.34 శాతం జరిగింది. జిల్లాలోని ఏడు ఫెసిలిటేటర్ల సెంటర్లలో ఓటుహక్కు వినియోగించుకు నేందుకు అధికారులు ఏర్పాట్లు చేశా రు. వివరాలు ఇలా ఉన్నాయి.

నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల ఫెసిలిటేట్‌ సెంటర్‌లో రెండోరోజు సోమవారం ఏర్పాటు చేసిన పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రి య ప్రశాంతంగా ముగిసింది. ఓట్లు వేసేందుకు ఉదయం నుంచే ఉద్యోగులు బారులు తీరారు. మొత్తం జిల్లాలో 16,282 మంది ఉద్యోగులు, ఇతరులు పోస్టల్‌ ఓటును ఏడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఏడు ఫెసిలిటేట్‌ సెంటర్లలో మూడురోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంది. నరసరావుపేట నియోజకవర్గంలో మొత్తం 2859 మంది ఉద్యోగుల్లో మొదటిరోజు 1340 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా, రెండోరోజు సోమవారం మిగతా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఫెసిలిటేట్‌ సెంటర్‌కు తరలి వచ్చారు. మొదటి రోజు కేవలం మూడు బూత్‌లను ఏర్పాటు చేయటంపై వచ్చిన అభ్యంతరాల మేరకు ఈరోజు సోమవారం అధికారులు ఏడు బూత్‌లను ఓటు వేసేందుకు ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు సులభంగా గంటల వ్యవధిలోనే తమ ఓటుహక్కును వినియో గించుకున్నారు. మధ్యాహ్నం 12.15 కు మొత్తం ఏడింటిలో నాలుగు బూత్‌లలో ఓట్లు వేసేవారు లేకపోవటంతో క్యూలైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోత మధ్య ఓటుహక్కును సాయంత్రం సమయంలో వినియోగించుకుందామనుకొని ఓటర్లు మధ్యాహ్నం సమయంలో పోలింగ్‌ సెంటర్‌కు పలుచగా హాజరయ్యారు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి ఒకరొకరుగా ఓటర్లు రావటం కన్పించింది. సాయంత్రం ఆరుగంటలకల్లా అధికారులు గేట్లు మూసేసి లోపల ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు.

డాక్టర్‌ గోపిరెడ్డి ఆగ్రహం

ఉదయమే రిటైర్డు ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణ రెడ్డిపై టీడీపీ అభ్యర్ధి కుమారుడు చదలవాడ ఆదిత్య చేసిన దౌర్జన్యాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు బయట సత్యనారాయణ ఉండగా అదే సమయంలో ఆదిత్య కార్ల కాన్వాయితో ప్రవేశద్వారం వరకు వచ్చాడు. దీనిపై సత్యనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు అతడిపై చేయి చేసుకొని బలవంతంగా తమ కార్లలో ఎక్కించుకొని అపహరించే ప్రయత్నం చేశారు. తాను రిటైర్డు మిలిటరీ వ్యక్తినని చెప్పటంతో వదిలిపెట్టారు. తనపై చేసిన దౌర్జన్యాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలియచేయటంతో వారు రొంపిచర్ల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి పెసిలిటేషన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. ఈలోగా పోలింగ్‌ సెంటర్‌ లోపలికి వెళ్లిన ఆదిత్య ఎమ్మెల్యే రాకను గమనించి రెండో గేటు నుంచి తన అనుమాయులతో పరారయ్యారు. పోలీసులు సెంటర్‌కు వందమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మూడు నుంచి ఏడుకు పెంచిన పోలింగ్‌ కేంద్రాలు సులభంగా ఓటుహక్కు వినియోగించుకున్న ఉద్యోగులు టీడీపీ దౌర్జన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement