ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకే టీడీపీ పన్నాగం | Sakshi
Sakshi News home page

ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకే టీడీపీ పన్నాగం

Published Tue, May 7 2024 11:30 AM

ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకే టీడీపీ పన్నాగం

డాక్టర్‌ అనిల్‌, డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ జరుగుతున్న ఫెసిలిటేట్‌ సెంటర్‌ వద్ద పసుపు కండువాలు వేసుకొని 200 మంది జెండాలతో రావటం ఎంతవరకు సబబని, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు వారు అక్కడకు కావాలని వచ్చారని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొ న్నా రు. సోమవారం సాయంత్రం అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పోలింగ్‌ జరుగుతున్న పెసిలిటేట్‌ సెంటర్‌ను పరిశీలించా రు. అనంతరం సెంటర్‌కు దూరంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరూ మాట్లాడారు. డాక్టర్‌ అనిల్‌ మాట్లాడుతూ ఆరేడు వాహనాలతో కలిసి సుమారు 200 మంది వరకు పోలింగ్‌ సెంటర్‌కు ఎందుకు వచ్చారని ప్రశ్నించిన మాజీ మిలటరీ ఉద్యోగి మధిర సత్యనారాయణ రెడ్డిని వీడు వైఎస్సార్‌సీపీ వాడు అంటూ మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ కారులోకి బలవంతంగా లాగి కొట్టి కొద్దిదూరం తీసుకెళ్లి అపహరించే ప్రయత్నం చేసి మళ్లీ వదిలేశారన్నా రు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి వెంటనే స్పందించి కార్యకర్తలను కాపాడుకునేందుకు పోలింగ్‌ సెంటర్‌కు వచ్చారన్నారు.

డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ తప్పుచేసిన వారే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నిష్పక్షపాతంగా పోలింగ్‌ నిర్వహించాలని అధికారులను కోరామన్నారు. మేకల రాజకుమార్‌ అనే యువకుడు లోపల డబ్బులు పంపిణీ చేస్తున్నాడన్నారు. ఓటు వేసేందుకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ నాయకులు కుట్రకు తెరతీశారన్నారు. మిలటరీ వ్యక్తిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement