స్టేషన్‌కు రమ్మనమని మాత్రమే పిలిచాం
నరసరావుపేట: కారెంపూడి మండలం కాచవరం గ్రామానికి చెందిన వెంగళరెడ్డి అనే వ్యక్తిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని స్థానిక పోలీసులు స్టేషన్‌కు రావాలని పిలిచారే కాని, అతనిపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, స్టేషన్‌కు రాలేదని, అతడిపై ఎటువంటి హింస జరగలేదని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. వెంగళరెడ్డిని ఒక కేసులో దోషిగా చేర్చి పోలీసుస్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు పెట్టడం వలన భరించలేని అతను వేదనతో చనిపోయాడనే వార్త లు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేస్తున్నారన్నారు. దీనిలో ఎటువంటి నిజంలేదు అన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పారు.
వెంగళరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే తెలుస్తుందన్నారు. అతను విషం తీసుకొని మృతిచెందినట్లుగా బంధువులు చెబుతున్నారన్నారు. ఈనెల రెండోతేదీన గ్రామంలో ముస్లింలు గ్యార్మీ పండగ చేసుకుంటూ ఇతని ఇంటిమీదుగా ఊరేగింపుగా వెళుతుండటంతో వారితో గొడవ పడ్డాడన్నారు. దీనిపై మూడో తేదీన అబ్బాస్ అనే వ్యక్తి తాము అతని ఇంటి ముందుగుండా వెళుతుండగా తమపై అనుచితంగా వ్యవహరించారంటూ పోలీసులకు ఫిర్యాదుచేయటం జరిగిందన్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ నిమిత్తం వెంగళరెడ్డిని పోలీసుస్టేషన్‌కు పిలిచారని, అయితే అతను స్టేషన్‌కు రాలేదన్నారు. దీనిపై స్టేషన్‌కు తీసుకొచ్చి వేధించారనేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా ప్రసారం చేసే వారి పై లీగల్ చర్యలు తీసుకుంటామని, పోలీసుల పరంగా వెంగళరెడ్డికి ఎటువంటి అపకారం జరగలేదని ఎస్పీ స్పష్టంచేశారు.
బెదిరింపులకు పాల్పడలేదు
కారెంపూడి: మండలంలోని కాచవరం గ్రామంలో సోమవారం వెంగళరెడ్డి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని గురజాల డీఎస్పీ బి.జగదీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుగుమందు తాగి చనిపోయాడని అందుకు పోలీసులు కారణమని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆత్మహత్యకు కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీఎస్‌పీ తెలిపారు.
వెంగళరెడ్డి స్టేషన్‌కు రాలేదు స్టేషన్‌లో చిత్రహింసలు జరగలేదు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వచ్చే వార్తల్లో నిజం లేదు స్పష్టం చేసిన ఎస్పీ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment