బెల్లంకొండ: మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగవుతున్న వరి, కంది క్షేత్రాలను సోమవారం ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం రాష్ట్ర బృందం సందర్శించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారితో కలసి స్టేట్ సీనియర్ టిమాటిక్ రాయుడు, గోపీచంద్, స్టేట్ రిసోర్స్‌పర్సన్ రామచంద్రన్ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న మోడల్స్, కాంపాక్ట్ బ్లాక్స్‌లను, పంటలను పరిశీలించారు. ప్రతి రైతు ఈ ప్రకృతి వనరుల కేంద్రంలోని ఽఘన జీవామృతం, ద్రవ జీవామృతం ఉత్పత్తులను వినియోగించుకోవడం ద్వారా రైతులకు పెట్టుబడులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన విషరహిత ఉత్పత్తుల లభిస్తాయన్నారు. కందిపంట ఏ–గ్రేడ్ మోడల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి కంది పంటలో 5నుండి10 రకాల అంతర పంటలు వేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూరి రైతు జీవన విధానం మెరుగుపడుతుందన్నారు. నిరంతరం ఆదాయం ఇచ్చే ఏటిఎం మోడల్, సూర్యమండలం మోడల్‌లో 27రకాల కూరగాయ పంటలు ఆకుకూరలు, దుంప జాతి ,తీగజాతినూనె, పూల జాతి రకాలను వేసి ఏడాది పొడవునా నెలకు రూ.5వేల నుండీ 10 వేల వరకు ఆదాయం వస్తుందని బృంద సభ్యులకు మహిళా రైతులు తెలిపారు. భూమిలో వివిధ రకాల పంటలు వేయడం వలన జీవవైవిద్యం పెరిగి భూమి సారవంతం, చీడ పీడల ఉధృతి తక్కువగా ఉంటుందని తెలిపారు. వరిలో ఏ–గ్రేడ్ మోడల్ కంపాక్ట్ బ్లాక్‌లోని క్షేత్రాన్ని సందర్శించారు. వరిలో గట్లపై అరటి కొబ్బరి, బొప్పాయి, జామ, బంతి అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతి మరియు తీగజాతి వేయడం జరిగివదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment