భక్తిశ్రద్ధలతో అమరేశ్వరునికి కార్తిక పూజలు
అమరావతి: ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం కార్తిక సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. పవిత్ర కార్తిక సోమవారం వేకువజాము నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన పంచారామక్షేత్ర సందర్శన భక్తులు సందడి నెలకుంది. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో కార్తిక దీపాలు వెలిగించి కార్తిక దామోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమ పపూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ సునీల్‌కుమార్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత అన్నదానం, ఉచిత ప్రసాదం అందచేశారు. వేలాది మంది భక్తులు, సందర్శకులు జిల్లా నలుమూలల నుంచి కార్తిక సోమవారం అమరావతిని సందర్శించటంతో మ్యూజియం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, అమరేశ్వరాలయం, స్నానఘాట్లు, సాయిమందిరం భక్తులు, సందర్శకులతో కళకళలాడాయి.
Comments
Please login to add a commentAdd a comment