అమరావతిలో వేదనాదం
అమరావతి: ప్రథమ పంచారామక్షేత్రం అమరావతిలో ఘంటశాల చంద్రమౌళీశర్మ ఆధ్వర్యంలో బుధవారం వేదపాఠశాలను శాస్త్రోక్తంగా ప్రాంరంభించారు. ఉదయం అమరేశ్వరస్వామి గాలిగోపురం నుంచి వేదపాఠశాల వరకు వేద విద్యార్థులు శోభాయాత్ర నిర్వహించారు. తొలుత బ్రహ్మశ్రీ సత్యనారాయణ అవధాని యజ్ఞిశ్రీ పర్యవేక్షణలో గణపతి హోమం, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచనం, మండపారాధనలు, వేదపారాయణలు, దుర్గాసప్తశతి పారాయణం, సూర్య నమస్కారాలు, లక్ష్మీగణపతి హోమ సహిత అవహంతిహవనం, రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహూతి కార్యక్రమాలతో ప్రారంభోత్సవాలు పూర్తిచేశారు. ఈసందర్భంగా ఘంటశాల చంద్రమౌళీశర్మ మాట్లాడుతూ అమరా వతి వేదపాఠశాలలో వంద మందికిపైగా పేద బ్రాహ్మణ విద్యార్థులకు బోజన, వసతి సౌకర్యాలతో ఉచిత వేద విద్య బోధన, స్మార్త ఆగమ విద్యను అందిస్తామని పేర్కొన్నారు.
వేగంగా పీఏసీఎస్‌ల
కంప్యూటరీకరణ
నరసరావుపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) కంప్యూటరీకరణ వేగంగా సాగుతోందని ఆప్కా బ్ డీజీఎం, ఉమ్మడి గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ నోడల్ ఆఫీసర్ సిహెచ్‌ఆర్‌సీఎస్ బాలాజీరావు చెప్పారు. పట్టణంలోని జీడీసీసీ బ్యాంక్‌ను బుధవారం ఆయన సందర్శించారు. జిల్లాలో 60 పీఏసీఎస్‌లు ఉన్నాయని, 28 సంఘాలలో ఇప్పటికే కంప్యూటరీకరణ పూర్తయిందని పేర్కొన్నారు. పలు సొసైటీలను సందర్శించి కంప్యూటరీకరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట జీడీసీసీ బ్యాంక్ పల్నాడు జిల్లా జనరల్ మేనేజర్ అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment