ఫిబ్రవరి నాటికి 46 వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు
నరసరావుపేట: జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాకు 94,512 కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయని, ఫిబ్రవరి 2025 నాటికి 46,316 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నీరు, పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.3.87 కోట్లతో ప్రణాళికను ఆమోదించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబరు 10 మానవ హక్కుల దినోత్సవం వరకు పరిశుభ్ర శౌచాలయాల ఆవశ్యకత తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో విశిష్ట సేవలు అందించిన నలుగురు క్లాప్ మిత్రలకు సన్మానం చేశారు. టాయిలెట్ ఫర్ డిగ్నిటీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ విజయకుమార్, జిల్లా భూగర్భ జల అధికారి శ్రీనివాసరావు, సీపీవో శ్రీనివాసమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకట్‌రెడ్డి, డీపీవో విజయభాస్కరరెడ్డి, డీఆర్డీఎ పీడీ బాలునాయక్, డీఎంహెచ్‌ఓ రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment