మైనర్‌తో వృద్ధుడి అసభ్య ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

మైనర్‌తో వృద్ధుడి అసభ్య ప్రవర్తన

Published Wed, Nov 20 2024 1:49 AM | Last Updated on Wed, Nov 20 2024 1:49 AM

-

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్‌నగర్‌లో ఓ మైనర్‌తో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి పోలీసులు దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం... డోలాస్‌నగర్‌ గాంధీనగర్‌ సమీపంలోని ఓ వ్యక్తి నివాసానికి పెదవడ్లపూడికి చెందిన నాంచారయ్య అనే వృద్ధుడు తరచు వస్తుంటాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ వ్యక్తి కుమార్తెను లోపలకు లాక్కెళ్లాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలిక తెలివిగా వ్యవహరించి అతడి నుంచి తప్పించుకోవడంతోపాటు నాంచారయ్య అసభ్య ప్రవర్తనను సెల్‌లో బంధించి తల్లిదండ్రులకు ఇచ్చింది. వారు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు నాంచారయ్యపై పోక్సో కేసు నమోదు చేశారు. పెదవడ్లపూడి నుంచి వచ్చి ప్రతిరోజు నులకపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో నాంచారయ్య తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆశ చూపి పలువుర్ని లొంగదీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చర్యలు ఎన్నో చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లను తన పేరిట రాయించుకుని, కొంతకాలం అనంతరం వారిని తన రాజకీయ పలుకుబడితో ఖాళీ చేయించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నులకపేట, బాబూ జగ్జీవన్‌రావు కాలనీ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇలా రాయించుకున్న ఇళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement