‘పాఠశాలల వేళల మార్పు సరికాదు’
సత్తెనపల్లి: రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు మార్చడం సరికాదని ఎస్టీయూ ఏపీ అధ్యక్షుడు ఎస్.ఎం.సుభాని పేర్కొన్నారు. సత్తెనపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పని వేళలను సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ఇది అశాసీ్త్రయ విధానమని, దీనిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యార్థి, ఉపాధ్యా య సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయని వెల్లడించారు. పనివేళల పొడిగింపు విద్యార్థుల మానసిక పరిస్థితి, సంసిద్ధత, అభ్యాసనం, బోధనతో ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు.
శ్రీలక్ష్మి అమ్మ హుండీ ఆదాయం రూ.23 లక్షలు
దుర్గి: అడిగొప్పల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ.23,87,102ల ఆదాయం వచ్చినట్లు ఆల య వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, కార్యనిర్వహణ అధికారి సైదమ్మబాయి తెలిపారు. బుధవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పేటసన్నిగండ్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి సి.హెచ్.శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో 63 రోజుల పాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకల గణనకు హుండీ లెక్కింపు చేపట్టారు. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అందజేసి సంబంధిత రశీదును తీసుకున్నట్లు అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియం, జిమ్ లీజుకు టెండర్లు ఆహ్వానం
నరసరావుపేట: స్థానిక డీఎస్‌ఏ (కోడెల శివప్రసాదరావు) స్టేడియంలోని ఇండోర్ స్టేడియం(షటిల్ కోర్టులు), జిమ్‌ను లీజుకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) పి.నరసింహారెడ్డి బుధవారం వెల్లడించారు. టెండర్ ఫారాలు ఈనెల 25 నుంచి డీఎస్‌డీఏ కార్యాలయంలో లభిస్తాయన్నారు. ఈనెల 29లోగా ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు టెండర్లను తెరుస్తామని, మరిన్ని వివరాలకు 87126 22574ను సంప్రదించాలని కోరారు.
విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన ఉండాలి
నరసరావుపేటటౌన్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ చెప్పారు. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మున్సిపల్ బాలుర పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహ నిరోధక చట్టం, విద్యా హక్కు, బాల కార్మిక నిర్మూలన చట్టాల గురించి వివరించారు. ఏదైనా సమస్యలు ఎదురైతే మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చుని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల, టూటౌన్ ఎస్‌ఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోపణలు వస్తే
సహించేది లేదు
నరసరావుపేటటౌన్: అవినీతి ఆరోపణలు వస్తే సహించేది లేదని డీఎస్పీ కె.నాగేశ్వరరావు సిబ్బందిని హెచ్చరించారు. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు, సిబ్బంది అవినీతిపై ‘ఖాకీల కలక్షన్ల పర్వం’ అన్న శీర్షికతో బుధవారం సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డీఎస్పీని ఆదేశించినట్లు సమాచారం. దీంతో డీఎస్పీ బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రూరల్ స్టేషన్‌తోపాటు వన్‌టౌన్, టూటౌన్ సీఐలతో సమావేశం నిర్వహించారు. మరో మారు అవినీతి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment