పట్టువదలని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు
తాడేపల్లి రూరల్: ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు పట్టువదలకుండా దీక్షను కొనసాగిస్తున్నారు. శిబిరాన్ని కూల్చివేసినా తిరిగి నిర్మించుకున్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పోరాట శిబిరాన్ని కూల్చివేసినా తిరిగి కార్మికులంతా ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని సీఐటీయూ తాడేపల్లి కార్యదర్శి వేముల దుర్గారావు అన్నారు. సోమవారం ఆయన పోరాట శిబిరాన్ని సందర్శించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. అధికారులు కనీస నిబంధనలను కూడా పాటించకుండా 200 గుడిసెలను అక్రమంగా కూలగొట్టడం అన్యాయమని ఖండించారు. ఏఐటీయూఎఫ్ నాయకులు కోటయ్య మాట్లాడుతూ కార్మికుల పట్టుదలను దెబ్బతీయడం కోసం ప్రభుత్వమే ఇళ్లను కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కె. స్టీవెన్, బి.అంకయ్య, బి.సూర్యప్రకాష్, ఎం.ఆశీర్వాదం, వై.యెహోషువా, కె.ఆదినారాయణ, రమాదేవి, ఎం.శారద, సామ్రాజ్యం, ఎం.గురవయ్య, సాంబశివరావు, సుబ్బారావు, యస్‌కె.ఆరిఫ్, సీపీఎం నాయకులు ఎం. పకీరయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment