సబ్ జూనియర్స్ విజేత ప్రకాశం జిల్లా ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ఎడ్ల పోటీలలో భాగంగా సోమవారం సబ్ జూనియర్స్ విభాగంలో పోటీలు జరిగాయి. పోటీలను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, చప్పిడి రాము తదితరులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం, మద్దిరాల ముప్పాళ్లకు చెందిన పుచ్చకాయల శేషాద్రిచౌదరి ఎడ్ల జత బండను 2,600 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానాన్ని కై వశం చేసుకుంది. గుంటూరు జిల్లా లింగాయపాలెంకు చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత 1,800 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానాన్ని, హైదరాబాదుకు చెందిన డి రోషన్‌బాబు ఎడ్ల జత 1,683 అడుగుల దూరం లాగి తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. విజేతలకు నగదు బహుమతులను గ్రామ ఇన్‌చార్జి సర్పంచ్ బాణావతు సరస్వతీబాయిబాలనాయక్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బూసా రామాంజనేయులు, మాజీ ఎంపీపీ రామావతు నాగులునాయక్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ, కంభంపాటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ గుండా బ్రహ్మయ్య, సంగినీడి బాలకృష్ణ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment