బాలోత్సవాలు జయప్రదం చేయాలి
శావల్యాపురం: బాలోత్సవాలు అత్యంత వైభవంగా జరుతాయని జిల్లా బాలోత్సవ అధ్యక్షులు సి.హెచ్.రాజారెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోస్టర్ అవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఈనెల 28,29 తేదీల్లో జరగనున్న నరసరావుపేట పీఎన్‌సీఅండ్‌కేఆర్ ప్రాంగణంలో బాలోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్టు వెల్లడించారు. బాలోత్సవాలకు 20 వేల మంది విద్యార్థులు హజరవుతారని వివరించారు. పోస్టర్ అవిష్కరించిన వారిలో బాలోత్సవ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, బెజవాడ చారిట్రబుల్ ట్రస్టు చైర్మన్, సీనియర్ ఆంగ్ల బోధకులు బెజవాడ నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బొడ్డపాటి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వేర్వేరు చోట్ల 23 మంది జూదరుల అరెస్టు
లక్ష్మీపురం: వేర్వేరు చోట్ల 23 మంది జూదరులను పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో నివాస గృహాల మధ్య ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు లేకుండా పేకాడుతున్న ఐదుగురు జూదరులను స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. దేవాపురం 3వ లైన్‌లోని ఆకుల రెసిడెన్సీ అనే అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు సిబ్బంది దాడి చేశారు. ఐదుగురు జూదరులను స్టేషన్‌కు తరలించి వారి వద్ద నుంచి రూ.84వేలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
● బృందావన్ గార్డెన్స్‌లోని ఓ హోటల్‌లో 18 మంది పేకాట ఆడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం ఆకస్మిక దాడులు చేసి 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment