పులిచింతల వద్ద ఆక్టోపస్ మాక్‌డ్రిల్
అచ్చంపేట: తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు ప్రాంతం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్(ఆక్టోపస్) అధికారులు మంగళవారం రాత్రి మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్తులను ఎలా ఎదుర్కోవాలి, విధులు ఎలా నిర్వహించాలి అనే విషయాలపై అడిషనల్ ఎస్పీ ఎ.రాజారెడ్డి టీం సభ్యులకు ప్రయోగాత్మకంగా వివరించారు. ముందుగా మాదిపాడులోని జెడ్పీ హైస్కూలులో టీమ్ సభ్యులతో సమావేశమాయ్యారు. అనంతరం పులిచింతల ప్రాజెక్టు వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాద సంస్థలు దాడులు నిర్వహించినప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆస్తులను, కట్టడాలను ఏవిధంగా రక్షించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో సుమారు 50 మందికిపైగా టీమ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ ఎ.ఎన్.రంగబాబు, ఆర్‌ఐస్ శ్రీకాంత్, శివప్రసాద్, రామచంద్రానాయక్, ఇరిగేషన్ ఏఈ, మెడికల్, రెవెన్యూ సిబ్బంది, అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment