ఆయుర్వేదం ముసుగులో..
గంజాయి విక్రేతలు కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఆయుర్వేద చాక్లెట్లుగా పేర్కొంటూ గంజాయి చాక్లెట్లను బడ్డీ కొట్లలో యథేచ్ఛగా అమ్ముతున్నారు. సెవన్ మినార్ పేరిట ఉన్న ఈ చాక్లెట్లను కొన్నినెలలుగా పాన్ షాపుల్లో అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా ఇతర ఏ పేర్లతోనైనా గంజాయి చాక్లెట్లు మార్కెట్‌లో అమ్ముతున్నారా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రోలెన్ పేపర్ సాయంతో గంజాయిని కేటుగాళ్లు సిగరెట్ రూపంలో మార్చి ఇంజినీరింగ్ విద్యార్థులకు అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం ఈ రోలెన్ పేపర్‌ను కేవలం బుక్‌స్టాళ్లలోనే అమ్మాలి. అయితే ప్రస్తుతం బడ్డీ కొట్లలోనూ రోలెన్ పేపర్ అమ్ముతుండడం విస్మయపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment