పేకాట, కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి
● 8 బైకులు, 9 సెల్‌ఫోన్లు, రూ.1.03 లక్షలు స్వాధీనం ● 8 మందిపై కేసు నమోదు
వినుకొండ(నూజెండ్ల): నూజెండ్ల మండలంలోని రవ్వారం కొండ వెనుక డంపింగ్ యార్డులో సాయంత్రం 5 గంటల సమయంలో పేకాట, కోడిపందేలు నిర్వహిస్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.లక్ష 3 వేల 500 నగదు, 8 బైక్‌లు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్‌రావు సోమవారం తెలిపారు. ఐనవోలు పోలీసు స్టేషనులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ అదేశాల మేరకు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సీఐతోపాటు ఎస్‌ఐ కృష్ణారావు, ఎస్‌బీ పోలీసు అధికారి మస్తాన్‌వలీ, రైటరు విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment