పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Wed, Dec 4 2024 1:58 AM | Last Updated on Wed, Dec 4 2024 1:58 AM

పల్నా

పల్నాడు

బుధవారం శ్రీ 4 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

చిలకలూరిపేటకు చెందిన ఓ యువకుడు బీటెక్‌ మూడో ఏడాది చదువుతుండగా తోటి విద్యార్థుల ద్వారా గంజాయికి సరదాగా అలవాటు పడ్డాడు. ఆ తర్వాత వ్యసనపరుడై గంజాయి కోసం ఇంట్లో దొంగతనాలు చేయడంతోపాటు ఏకంగా అర్ధరాత్రి స్నేహితులతో కలిసి దారిదోపిడీలకు పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అతని తల్లిదండ్రులు గంజాయి మాన్పించడానికి విజయవాడలోని ఓ డీ అడిక్షన్‌ సెంటర్‌లో కొన్ని రోజులు ఉంచారు. మత్తు లేకుండా ఉండలేకపోయిన ఆ యువకుడు వారం తర్వాత డీ అడిక్షన్‌ సెంటర్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని మరణించాడు. ఇలా అనేక మంది జీవితాలు గంజాయి వల్ల నాశనమై పోతున్నాయి. ఇప్పటి వరకు సిగరెట్లు, లిక్విడ్‌ రూపంలోనే లభ్యమవుతున్న గంజాయి తాజాగా చాక్లెట్ల రూపంలోనూ లభించడం గగుర్పాటుకు గురిచేస్తోంది. ఈ విష సంస్కృతి ఇంకా ఎందరి ప్రాణాలు బలి తీసుకుంటుందో మరి..

మాదకద్రవ్యాలతో పెనుముప్పు

ఈగల్‌ టీం డైరెక్టర్‌ రవికృష్ణ

నరసరావుపేటటౌన్‌: మాదకద్రవ్యాలు సమా జాన్ని అంతర్గతంగా బలహీనపరుస్తున్నాయని, వాటిపై 1972 నంబర్‌కు సమాచారం అందించాలని ఈగల్‌ టీం డైరెక్టర్‌ ఆకే రవికృష్ణ తెలిపారు. నరసరావుపేటకు మంగళవారం వచ్చిన ఆయన స్థానిక ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నరసరావుపేట సమీపంలోని ఈటీ గ్రామం వద్ద 400 గంజాయి చాక్లెట్లను సోమవారం పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులను అభినందించారు. ఈ చాక్లెట్ల మూలాలపై విచారణ చేస్తున్నామన్నారు. పోలీస్‌, ఎకై ్సజ్‌, ఈగల్‌ టీంలు సంయుక్తంగా సమావేశం నిర్వహించి గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామన్నారు. వైజాగ్‌ టూటౌన్‌ పరిధిలో ఒక కేసు, ఎకై ్సజ్‌ పోలీసులు పలు ప్రాంతాల్లో మూడు కేసులు గంజాయిపై నమోదు చేశారన్నారు. మాదకద్రవ్యాలపై టోల్‌ ఫ్రీ నంబరు 1972కు ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు. సమావేశంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎకై ్సజ్‌ డీసీ కె.శ్రీనివాస్‌, ఏసీ రవికుమార్‌రెడ్డి, ఎస్‌టీఎఫ్‌ ఏసీ సుధాకర్‌రెడ్డి, ఈఎస్‌ మణికంఠ, ఏఈఎస్‌ రవీంద్ర, సీఐ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, నరసరావుపేట: గంజాయి కేటుగాళ్లు రూటు మార్చారు. ఇప్పటివరకు లిక్విడ్‌, పొడి, సిగరెట్ల రూపాల్లోనే అమ్మిన వారు తాజాగా విద్యార్థులు తినే చాక్లెట్ల రూపంలోనూ గంజాయిని అందుబాటులోకి తెచ్చారు. విస్తుగొలిపే ఈ నిజం సోమ వారం పోలీసుల తనిఖీల్లో బట్టబయలైంది. నరసరావుపేట శివారు కోటప్పకొండ సమీపంలో 400 గంజాయి చాకెట్లు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. గంజాయి సంస్కృతి చాప కింద నీరులా జిల్లాలో ఎలా విస్తరిస్తోందో కళ్లకకు కట్టింది. అచ్చు చిన్నపిల్లలు తినే చాక్లెట్‌లా ఉండే దీనికి ఒకసారి ట్రై చేద్దామని రుచి మరిగిన యువత బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సమాచారం.

విచ్చలవిడిగా అమ్మకాలు

నరసరావుపేట గంజాయి అమ్మకాలకు అడ్డాగా మారింది. అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 24న నరసరావుపేట టూటౌన్‌ పోలీసులు దాడులు నిర్వహించి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు విక్రేతలను అరెస్ట్‌ చేశారు. పట్టణంలో ఇంత పెద్దమొత్తంలో గంజాయి దొరకడంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. అక్టోబర్‌ 19న నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 8 మంది గంజాయి విక్రేతల నుంచి ఏడు కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణాలో ఎక్కువ మంది యువత ఉన్నా రు. వీరు గంజాయి కొనడానికి డబ్బుల్లేక ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. గంజాయికి బానిసలై కొందరు చదువులనూ అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు.

మూలాలపై దృష్టేది?

గంజాయి విక్రేతలు పట్టుబడిన సందర్భంలో పోలీసులు మూలాలపై దృష్టిపెట్టడం లేదన్న వాదన ఉంది. ఫలితంగా నిందితులు వారం రోజులకే బెయిల్‌పై విడుదలై యథావిధిగా నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయి అమ్మకాల వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నట్టు విమర్శలున్నాయి. గంజాయి వ్యాపారులకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. ఎక్కడైనా గంజాయితో పట్టుబడితే వెంటనే నిందితుడు తమవాడేనంటూ రాజకీయ నేతలు స్టేషన్‌ ముందు వాలిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు కొన్ని కేసులను దరాప్తు చేయకుండా వదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.

చాక్లెట్‌ రూపంలోనూ అమ్మకాలు

ప్రభుత్వ వైఫల్యంతో విస్తరిస్తున్న విష సంస్కృతి

కోటప్పకొండ సమీపంలో 400 గంజాయి చాక్లెట్ల స్వాధీనం

పాఠశాల, కళాశాల విద్యార్థులే టార్గెట్‌గా విజృంభిస్తున్న ముఠాలు

గత ప్రభుత్వంలో ఎస్‌ఈబీ ద్వారా మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం

ఎస్‌ఈబీకి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం

7

న్యూస్‌రీల్‌

ఎస్‌ఈబీ నిర్వీర్యం

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టడంలో విజయం సాధించింది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణా జరగకుండా కట్టడి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్‌ఈబీని రద్దు చేసి ఎకై ్సజ్‌ శాఖలో విలీనం చేసింది. చెక్‌పోస్టులు, ప్రత్యేక టీంలు లేకపోవడంతో మాదక ద్రవ్యాల రవాణాకు గేట్లు తెరిచినట్టయింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం గమనించిన కూటమి ప్రభుత్వం నష్టనివారణ చర్యలలో భాగంగా ఈగల్‌ పేరిట ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

నిరంతర నిఘా

మాదకద్రవ్యాల రవాణా కట్టడికి స్పెషల్‌ డ్రైవ్‌ను కొనసాగిస్తాం. పాఠశాల, కళాశాల విద్యార్థులు గంజాయి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి సమాచారం తెలిసిన వారు మా దృష్టికి తీసుకురావాలి. నిరంతర నిఘా ఉంటుంది.

– మణికంఠ, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, పల్నాడు జిలా్ల

No comments yet. Be the first to comment!
Add a comment
పల్నాడు1
1/10

పల్నాడు

పల్నాడు2
2/10

పల్నాడు

పల్నాడు3
3/10

పల్నాడు

పల్నాడు4
4/10

పల్నాడు

పల్నాడు5
5/10

పల్నాడు

పల్నాడు6
6/10

పల్నాడు

పల్నాడు7
7/10

పల్నాడు

పల్నాడు8
8/10

పల్నాడు

పల్నాడు9
9/10

పల్నాడు

పల్నాడు10
10/10

పల్నాడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement