విద్యుత్ చార్జీలపై ప్రజల పక్షాన పోరుబాట
నరసరావుపేట: విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక మాట తప్పారని, వెంటనే పెంచిన చార్జీలను విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కరెంటు చార్జీల బాదుడుపై ఈనెల 27న నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ పోరుబాట పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పిన్నెల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చార్జీలను తగ్గిస్తానని, వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పులివెందుల, కడప, టీడీపీ మహానాడు, పెద్దాపురం, వైజాగ్‌లో విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా బూటకపు వాగ్దానాలు చేశారని పిన్నెల్లి ధ్వజమెత్తారు. ఆరునెలలు తిరగకుండానే జనంపై చార్జీల భారం మోపారని విమర్శించారు. విద్యుత్ చార్జీలు నవంబరులో రూ.6,072 కోట్లు, డిసెంబరులో రూ.9,412 కోట్లు పెంచి మొత్తం కలిపి రూ.15,484 కోట్ల భారం ప్రజల నెత్తిన మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీలు గాలికొదిలేసిన బాబు చార్జీలు పెంచడం సమంజసం కాదని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారిపై పోలీసుల చేత కాల్పులు జరిపించి ప్రాణాలు బలిగొన్న రాక్షసుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. 2014 నాటికి డిస్కంలు రూ.29 వేల కోట్ల అప్పుల్లో ఉంటే 2019 నాటికి వాటిని రూ.86వేల కోట్లకు చేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతోందని ఎద్దేవా చేశారు. డిస్కంలను ఆదుకునేందుకు చంద్రబాబు చేసిన సహాయం రూ.13,255 కోట్లు అయితే, వైఎస్సార్ సీపీ హయాంలో రూ.47 వేల కోట్లు డిస్కంలకు అందించి చేయూత ఇచ్చినట్టు పిన్నెల్లి గుర్తుచేశారు. టీడీపీ హయాంలో డిస్కంలు చేసుకున్న ఒప్పందంతో పవన విద్యుత్ ధర రూ.4.70ల నుంచి రూ.4.84 వరకు ఉందని, వైఎస్సార్ సీపీ హయాంలో సెకీతో ఒప్పందం వల్ల ధర రూ.2.49లకు తగ్గిందని వివరించారు. దీంతో వచ్చే 25 ఏళ్లల్లో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు ఆదా కానుందని పేర్కొన్నారు.
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే విరమించుకోవాలి ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చార్జీలు తగ్గించేంతవరకు వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు ఈనెల 27న జిల్లా వ్యాప్తంగా ఆందోళన ప్రజలపై రూ.15,484 కోట్ల మేర విద్యుత్ భారం మోపిన కూటమి సర్కారు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి ధ్వజం హైదరాబాద్‌లో పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment