చిలకలూరిపేట: ఏపీ నైపుణాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 27న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ.తమ్మాజీరావు తెలిపారు. పట్టణంలోని రాగన్నపాలెంలో ఉన్న కమ్యూనిటీ హాలులో ఈ జాబ్‌మేళా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పీజీ చదువుకున్న 18 నుంచి 50 సంవత్సరాలలోపు వారు హాజరు కావచ్చన్నారు. జాబ్‌మేళాకు వచ్చేవారు వారి విద్యార్హత ధ్రువీకరణ పత్రాల కాపీలు, ఆధార్ నకలు, పాస్‌పోర్టు సైజు ఫొటో తీసుకురావాలన్నారు. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, వసంత టెక్స్‌టైల్స్ వంటి కంపెనీలు హాజరు అవుతాయని, విద్యార్హతను బట్టి రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జీతం ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు 91005 66581, 91602 00652 నంబర్లలో సంప్రదించాలన్నారు.
31లోగా ఓపెన్ స్కూల్ ఫీజు చెల్లించాలి
నరసరావుపేట ఈస్ట్: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025 మార్చి నెలలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే అభ్యాసకులు ఈనెల 31వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సోమవారం తెలిపారు. అపరాధ రుసుం రూ.25తో జనవరి 4వ తేదీలోపు, రూ.50 అపరాధ రుసుంతో జనవరి 8 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే తత్కాల్ ఫీజు రూ.వెయ్యితో ఇంటర్మీడియెట్, రూ.500తో పదవ తరగతి ఫీజును జనవరి 9, 10 తేదీలలో చెల్లించవచ్చని వివరించారు. పదవ తరగతి అభ్యాసకులు థియరీ సబ్జెక్ట్‌కు రూ.100, ఇంటర్మీడియెట్‌కు రూ.150, ప్రాక్టికల్ పరీక్షకు సబ్జెక్ట్‌కు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపారు. అభ్యాసకులకు బెటర్‌మెంట్ రాసే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. అభ్యాసకులు తమ సమీపంలోని ఓపెన్ స్కూల్ కేంద్రాలు, లేదా జిల్లా పరీక్షల విభాగంలోనూ సంప్రదించాలని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్ www.apopen school.ap.gov.in ద్వారా టైం టేబుల్ పొందవచ్చని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment