చెంచుల ఆర్థిక అభివృద్ధికి కృషి
నివాస ప్రాంతాలను సందర్శించిన కేంద్ర బృందం
బొల్లాపల్లి : మండలంలో గిరిజనులు నివసించే గ్రామాల్లో సోమవారం కేంద్ర బృందం పర్యటించింది. చెంచు సమాఖ్య సంఘాలతో మాట్లాడి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకుంది. కేంద్ర బృందం ఉన్నతి పథకానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ రాజాప్రతాప్, డైరెక్టర్ ఉషారాణి, సెర్ప్ ఐబీ డైరెక్టర్ వాల్మీకి, డీపీఎం హనుమానాయక్, ఉన్నతి డీపీఎం జీవన్‌లు ఆయా గ్రామాల్లో చెంచు కాలనీలను సందర్శించారు. వెల్లటూరులో చెంచులు నివసించే కాలనీని సందర్శించారు. జీవనోపాధులు, స్థితిగతుల గురించి ఆరా తీశారు. డీఆర్‌డీఏలో భాగంగా వెలుగు పథకంలో చెంచు సమాఖ్య సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఎ ఏపీఎం టి. రంగారెడ్డి మాట్లాడుతూ చెంచులకు జీవనోపాధి కల్పించి వారి ఆర్థిక అభ్యున్నతి ఎదుగుల కృషిలో భాగంగా కేంద్ర బృందం గ్రామాలను సందర్శించినట్లు తెలిపారు. ఉన్నతి పథకం ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు అందించి పలు పథకాల్లో వారు అభివృద్ధి సాధించేందుకు మరింత సహకారం అందించనున్నట్లు తెలిపారు. వడ్డీ లేకుండా రుణాలు అందజేయనున్నట్లు ఏపీఎం తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన గిరిజన తెగలకు మరింత ఆర్థిక సహాయ,సహకారాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడే విధంగా కేంద్ర బృందం చొరవతో పథకాలు అమలు తీరు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment