గ్రామ సచివాలయంలో ఖాళీ కుర్చీలే దిక్కు
లంకెలకూరపాడు (ముప్పాళ్ళ): మండలంలోని లంకెలకూరపాడు గ్రామ సచివాలయం ఖాళీగా దర్శనమిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియలో భాగంగా ఇక్కడి నుంచి వెళ్లిన వారి స్థానాలు భర్తీ కాలేదు. మిగిలిన కొందరు ఉద్యోగులు మంగళవారం విధులకు హాజరు కాకపోవటం కూడా దీనికి మరో కారణం. డిజిటల్ అసిస్టెంట్ ఒక నెల సెలవుపై వెళ్లగా, సర్వేయర్ మెటర్నరీ లీవ్, మహిళా పోలీసు ముప్పాళ్ళలోని పోలీస్‌స్టేషన్‌లో విధులకు వెళ్లారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సాయంత్రం వేలిముద్ర వేసే సమయానికి హాజరయ్యారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ జాడ లేదు. ఏఎన్‌ఎం కూడా పీహెచ్‌సీలో విధులకు వెళ్లిపోయారు. వీఆర్వో మాత్రమే విధుల్లో ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి మూడు గ్రామాలకు ఇన్‌చార్జ్ కావటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్, హార్టీకల్చర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment