భక్తిశ్రద్ధలతో ముగ్గురు రాజుల మహోత్సవం
పెదకూరపాడు: ముగ్గురు రాజుల మహోత్సవం బుధవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గుంటూరు పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్య ముఖ్య అతిథిగా మహోత్సవ సమష్టి పూజాబలి నిర్వహించారు. వాక్యోపదేశం చేస్తూ ప్రతి ఒక్కరూ క్షమ, దయ కలిగి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలన్నారు. ఎదుటివారికి సాయ పడాలని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మత గురువులకు ముగ్గురు రాజులు ఘనతను వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాయంత్రం కొవ్వొత్తుల సమర్పణ నిర్వహించారు. కాలచక్ర రహదారి వెంబడి ఏర్పాటు చేసిన ప్రత్యేక అంగళ్లు ఆకట్టుకున్నాయి. రాత్రి బాల ఏసుతో కూడిన మేరీమాత విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు రాజుల దేవాలయ విచారణ గురువులు పెంటారెడ్డి రాజారెడ్డి, సహాయ గురువులు బాల ధీరజు ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment