పల్నాడు
బుధవారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2025
ప్రసన్నాంజనేయునికి పూజలు
భట్టిప్రోలు: మండల పరిధిలోని ఐలవరం గ్రామంలో ఉన్న వేణు గోపాలస్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయస్వామికి మంగళవారం రాచూరు జమిందారు సహకారంతో ప్రత్యేక పూజలు చేశారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 565 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు వదిలారు.
పాఠశాలలో జిల్లా కలెక్టర్ తనిఖీ
నరసరావుపేట రూరల్: మండలంలోని లింగంగుంట్ల గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను మంగళవారం కలెక్టర్ పి.అరుణ్‌బాబు తనిఖీ చేశారు.
అచ్చంపేట: అచ్చంపేట మండలంలో కూటమి ప్రభుత్వం నాలుగు ఇసుక రీచ్‌లను మంజూరు చేసింది. భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహిసున్నారని అధికారులు దాడులు చేయడంతో అంబడిపూడి–1 రీచ్ మూతపడింది. కృష్ణానదికి అడ్డంగా రెండు కిలోమీటర్లు పొడవున రోడ్డు వేసి ఇసుక తవ్వేందుకు యత్నించగా కోనూరు రీచ్‌ని కూడా ముసేశారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనల ప్రకారం నిర్వహించాలంటే తమ వల్ల కాదని, అధికారులు చూసీచూడనట్లు పోతేనే సాధ్యమని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో మిగిలిన అంబడిపూడి–2, అంబడిపూడి–3 రీచ్‌లు ప్రారంభం కాలేదు.
ఉపాధి కోల్పోయిన కార్మికులు
దీంతో రీచ్‌లను నమ్ముకున్న వేల మంది కార్మికులు, పడవ యజమానులు రోడ్డున పడ్డారు. మండలంలోని కోనూరు, కస్తల, కోగంటివారిపాలెం, చామర్రు, మాదిపాడు, గింజుపల్లి, చింతపల్లి, అంబడిపూడి తదితర గ్రామాలకు చెందిన రెండు వేల మందికిపైగా కార్మికులు ఇసుక తరలింపుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. నది లోతుల్లోనుంచి ఇసుకను ఒడ్డుకు చేర్చేందుకు కస్తల, కోనూరు, మాదిపాడు గ్రామాలలో సుమారు 400కుపైగా పడవలు ఉన్నాయి. నాలుగు రీచ్‌లు ఒకేసారి మూతపడటంతో కార్మికులు, పడవల యజమానులు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
నది లోతుల్లోనుంచి కార్మికులు ఇసుకను తోడి పడవల ద్వారా ఒడ్డుకు చేర్చినందుకు కాంట్రాక్టరుకు ప్రభుత్వం క్యూబిక్ మీటరుకు రూ.108 చొప్పున చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ టెండర్లు పిలిచింది. నియోజకవర్గంలోని పొందుగుల, అంబడిపూడి–1 రీచ్‌లలో రూ.54.99కే మిస్సర్ గోదావరి కృష్ణా వాటర్ వర్క్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ టెండర్లు దక్కించుకుంది. కానీ భారీ యంత్రాలను ఉపయోగించింది. పరిమితిని మించి ఇసుకను తవ్వి రవాణా చేశారు. కూటమిలోని మరో వర్గం వారు ఫిర్యాదులు చేశారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ అధికారులు దాడులు చేసి అయిదు పెద్ద యంత్రాలను, లోడ్ లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో రీచ్ మూతపడింది. కోనూరు ఇసుక రీచ్‌ను రూ.109కి బిడ్ ద్వారా దక్కించుకున్న మిస్సర్స్ సాయి క్యూ అండ్ ఎస్ సొల్యూషన్స్ ఏకంగా కృష్ణానదిలో రెండు కిలోమీటర్ల రోడ్డు వేసింది. కూటమిలోని వారే ఫిర్యాదు చేయడంతో రీచ్ ప్రారంభం కాకుండానే అధికారులు నిలిపివేశారు.
I
న్యూస్‌రీల్
యథేచ్ఛగా రవాణా
ఇదే అదనుగా ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకునే అవకాశాన్ని అక్రమార్కులు అందిపుచ్చుకున్నారు. నదిలోకి వెళ్లడం, ట్రాక్టరుకు పైవరకు లోడ్ చేసుకుని బహిరంగంగా రవాణా చేస్తూ అధిక ధరకు విక్రయిస్తున్నారు. అమరావతి మండలంలోని పొందుగుల, దిడుగు రీచ్‌లను కూడా దక్కించుకున్న ఈ కాంట్రాక్టర్లే ట్రైబ్యునల్ నిబంధనలను పాతరేసి తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులను ప్రలోభాలకు గురిచేసి పెద్ద యంత్రాలను వినియోగిస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్మాణదారులు డబ్బులు పెట్టినా ఇసుక అందించలేని దుస్థితిలో సర్కార్
అచ్చంపేట మండలానికి
నాలుగు రీచ్‌లు మంజూరు
రెండు చోట్ల కార్యకలాపాల నిలిపివేత
నిబంధనలు పాటించలేమని
చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
కనీసం ప్రారంభానికీ నోచుకోని
మరో రెండు
ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ
కార్మికులు, పడవల యజమానులు
Comments
Please login to add a commentAdd a comment