దక్షిణ భారత స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు గుంటూరు ప్రాజె
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు బ్రాడీపేటలోని శారదానికేతన్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ఎండీ అనీసాబేగం, ఎస్.ఈర్చిత రూపొందించిన గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్టు దక్షిణ భారతదేశ స్థాయి ప్రదర్శనకు ఎంపికై ంది. ఈనెల 4న గుంటూరులో జరిగిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్రస్థాయికి ఎంపికై న ‘‘గగన్‌యాన్ మిషన్’’ తాజాగా మంగళ, బుధవారాల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో దక్షిణ భారతదేశ స్థాయికి అర్హత సాధించింది. ఈనెల 21 నుంచి 25 వరకు పుదుచ్ఛేరిలో ప్రదర్శన జరగనుంది. శారదానికేతన్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఎండీ అనీసాబేగం, ఎస్.ఈర్చిత గైడ్ టీచర్ ఆరిఫ్ బేగ్ సహకారంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అంతరిక్షంలోకి మానవులు ప్రయాణించేందుకు వీలుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సొంతంగా చేపడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గగన్‌యాన్ విశేషాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టు సందర్శకులను విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకుంది. అంతరిక్షంలోకి మనుషులను తీసుకువెళ్లి, సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలపై నమూనా ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థినులు గగన్‌యాన్ మిషన్ విశేషాలను చక్కగా వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ సీవీ రేణుక.. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.ఉషాకుమారితోపాటు గైడ్ టీచర్ ఆరిఫ్ బేగ్, విద్యార్థినులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment