![సుందరకాండ పారాయణం చేస్తున్న
భగవద్రామానుజ దాస బృందం - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/2/01vzg161-370047_mr_0.jpg.webp?itok=CDTs6rgt)
సుందరకాండ పారాయణం చేస్తున్న భగవద్రామానుజ దాస బృందం
నెల్లిమర్ల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరాముడి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సింహాచలానికి చెందిన భగవద్రామానుజ దాసబృందం ప్రతినిధి కందాళ రాజగోపాలాచార్యులు(రాజా) ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ముందుగా దేవస్థానం అర్చకులు యథావిధిగా ఆలయంలో ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించారు.అలాగే సుందరకాండ హోమం, సుందరకాండ హవనం, అష్టకం అవనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్థాన మంటపానికి సీతారాముల ఉత్సవ విగ్రహాలను వేంచేపుచేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా భగవద్రామానుజ దాస బృందం ప్రతినిధి రాజగోపాలాచార్యులు బృందం సభ్యులు సుందరకాండ పారాయణం చేశారు. అలాగే అర్చకులతో కలిసి శ్రీరామపట్టాభిషేకాన్ని నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిశోర్‌కుమార్ పర్యవేక్షించగా, ఆలయ అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, ఖండవిల్లి కిరణ్‌కుమార్, సుదర్శనం పవన్‌కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment