నవంబర్ 6 నుంచి కంటి పరీక్షలు
పార్వతీపురంటౌన్: జిల్లా వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు మొదటి విడతగా, 6 మండలాల పరిధిలో ఉన్న 138 సచివాలయాల పరిధిలో నేత్ర పరీక్షలు నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సుకుమార్ బాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లాలో పనిచేస్తున్న నేత్ర వైద్యాధికారులు, నేత్ర వైద్య సహాయకులతో సమావేశం నిర్వహించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్న విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కంటి తనిఖీలు చేసిన వారికి దృష్టి దోషం ఉంటే మళ్లీ నేత్ర పరీక్షలు నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో వయసు మళ్లిన వాళ్లందరికీ నేత్ర పరీక్షలు చేయాలని ఆదేశించారు. నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేసిన వారి వివరాలు ఎలా పొందు పరచాలో వివరిస్తూ మెల్లకన్ను, గాయాల వలన వచ్చే క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సల కోసం పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా కంటి వెలుగు సెల్ నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి జిల్లాలో పనిచేస్తున్న నేత్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment