గుంపలో భక్తుల రద్దీ
● కొరవడిన పోలీసుల బందోబస్తు, పర్యవేక్షణ ● క్యూలో ఇబ్బందులు పడిన మహిళలు
కొమరాడ: కార్తీకమాసంలో మొదటి సోమవారం కావడంతో ఉత్తరాంధ్ర ప్రసిద్ధి చెందిన కొమరాడ మండలంలోని శ్రీ గుంపసోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు తెల్లవారు జామునే ఆల యానికి తరలివచ్చారు. నాగావళి, జంఝావతి నదుల సంగమంలో బలరాముడు ప్రతిష్టించిన శివాలయం ఇది కావడంతో నదిస్నానం చేసి సోమేశ్వరుని దర్శించుకుంటే కాశీ వెళ్లినంత పుణ్యం లభిస్తుందని ఈ ప్రాంత భక్తుల నమ్మకం. ఇంత పవిత్రమైన ఆలయంలో పర్యవేక్షణ కొరవడిన కారణంగా ఆలయానికి తరలివచ్చిన మహిళాభక్తులు క్యూలో ఇబ్బందులు పడ్డారు. అంత రద్దీ ఉండే ఆలయం వద్ద పోలీస్ సిబ్బంది లేకపోవడంతో పాటు కార్తీక మెదటి సోమవారం కావడంతో శివుని దర్శనార్థం భక్తులు కిటకిటలాడడంతో అవస్థలు తప్పలేదు. లైన్‌లో వేచి ఉన్న భక్తులు విసిగిపోయి త్రీవ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా దేవాదాయ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు దృష్టిసారించి భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment