మత్స్యకారులకు గడ్డుకాలం!
భామిని: జిల్లాలోని సంప్రదాయ మత్స్యకారులకు గడ్డుకాలం ఎదురైంది. ఓ వైపు వర్షాభావంతో చెరువులు, ప్రాజెక్టుల్లో అరకొర నీరు ఉంది. పెంపకానికి వేసిన చేపపిల్లలు పెరుగుతాయోలేదోనన్న బెంగ వెంటాడుతోంది. మరోవైపు చేపలు పట్టుకునేందుకు అవసరమైన వలలు, పనిముట్లు ప్రభుత్వం నుంచి అందక, సంక్షేమ పథకాల ఆర్థిక లబ్ధి ఖాతాల్లో జమకాక జీనవం భారంగా మారింది. చేపలు పట్టుకొని జీవించే జాలర్లు, కేవటలు, బెస్తాల కుటుంబాలకు ఉపాధి కరువైంది. జీవనం భారంగా మారింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఫిష్ ఆంధ్రా యూనిట్లు, రాయితీలు మంజూరుకావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సుమారు 1595 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వీరు 35 మత్స్యకార సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ పథకాలతో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించింది. స్థానిక సాగునీటి వనరుల్లో పెంచిన చేపల విక్రయానికి వీలుగా ఫిష్ ఆంధ్రా–పిట్ ఆంధ్రా పేరుతో జిల్లాలోని మత్స్యాకారులకు 68 యూనిట్లు మంజూరు చేసింది. పాలకొండ డివిజన్‌లో 35 యూనిట్లు, సాలూరులో 15, పార్వతీపురంలో 18 యూనిట్లు ఏర్పాటుచేయించింది. జిల్లాలోని 35 మత్స్యకార సంఘాల పరిధిలోకి 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌లలో 26 లక్షల 90 వేలు ఫింగర్‌రింగ్ సైజ్ చేప పిల్లలు వదిలించి మత్స్యకారులకు ఉపాధి కల్పించింది. బైక్‌లు, ఐస్‌బాక్సులు వంటివి రాయితీపై అందజేసింది. ప్రస్తుతం ఈ సదుపాయాలు లేకపోవడం, కొత్త యూనిట్లు మంజూరు కాకపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అందని ప్రభుత్వ ప్రోత్సాహకాలు
వేట సాగక జీవనానికి ఇబ్బందులు
ిఫిష్ ఆంధ్రా–పిట్ ఆంధ్రా స్టాల్స్
బుట్టదాఖలు
నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం
ప్రోత్సాహకాలకు దరఖాస్తుల స్వీకరణ
సీతంపేట ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు నాలుగు గిరిజన మండలాల్లోని 454 చెరువుల్లో చేపల పెంపకానికి 12,98,500 చేప పిల్లలను ఉచితంగా అందించాం. గిరిజన మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు 90 శాతం సబ్సిడీపై వలలు, ద్విచక్ర వాహనాలు, చేపలు తరలించే వాహనాలు అందించడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఎప్‌హెచ్‌జీలు, వీడీవీకేలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గిరిపుత్రులకు స్కాంఫీ జాలీకి చెందిన 5,97,800 మంచినీటి రొయ్యి పిల్లలు శతశాతం రాయితీతో సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– డబ్బీరు గోపీకృష్ణ, ఎఫ్‌డీఓ, పాలకొండ
మత్స్యకారులకు ఉపాధి కల్పించాలి
ప్రభుత్వం సంప్రదాయ మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. మత్స్యకార సంఘాలకు నీరు ఉన్న చెరువులు కేటాయించి చేపలు పట్టేవారికి ఉపాధి మార్గం చూపాలి. గత ప్రభుత్వం కృషితో స్థానికంగానే చేపలు అమ్ముకునే అవకాశం కలిగింది. ఆ విధానాలను కొనసాగించాలి. – చెక్కా శ్రీనివాసరావు,
స్వదేశీ మత్స్యకార సంఘం అధ్యక్షుడు, భామిని
జీవనం భారం
ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు అందించ లేదు. వర్షాభావంతో చెరువుల్లో నీరు లేదు. చెరువుల్లో విడిచిపెట్టిన చేపలు చనిపోతున్నాయి. వేటలేక రోజువారీ జీవనం కష్టంగా మారింది.
– కేవటి భీముడు, మత్స్యకారుడు, నేరడి–బి
నేడు అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం
పార్వతీపురం: అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించనున్నట్టు జిల్లా మత్స్యశాఖాధికారి వి. తిరుపతయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి, సంక్షేమానికి, మత్స్య పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment