పార్వతీపురం మన్యం జిల్లాలో వరి కోతలు, నూర్పిడి జోరుగా సాగుతున్నా.. నేటికీ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం నుంచి ఏర్పాటు కాలేదు. నవంబర్ మూడో వారం గడుస్తున్నా.. ఒక్క పార్వతీపురం మండలం పెదబొండపల్లి వద్దనే అధికారికంగా కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఇక్కడ నుంచి 10 టన్నులు మాత్రమే ధాన్యం వచ్చిందని.. ఇంకా పూర్తిస్థాయిలో రైతులు పంటను తీసుకురావడం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే కోతలు పూర్తయిన ధాన్యాన్ని అన్నదాతలు తమ వద్ద ఉంచుకోలేక.. గ్రామాల్లోకి వస్తున్న దళారులకు, మధ్యవర్తులకు విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
2.20 లక్షల మెట్రిక్ టన్నుల
సేకరణ లక్ష్యం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని 15 మండలాల పరిధిలో దాదాపు 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇటీవల పలు మండలాల్లో నిర్వహించిన పంట కోత ప్రయోగాల ప్రకారం 3,57,921 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రైతుల అవసరాలకుపోనూ.. సుమారు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణకు పౌరసరఫరాల అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 183 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికి వచ్చినవి ఐదు బ్యాంకు
గ్యారంటీలే..
జిల్లాలో 93 రైస్ మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1:1 నిష్పత్తి ప్రకారం మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీలను తీసుకుని, ధాన్యం మర ఆడించేందుకు ఇస్తుంటారు. స్థానిక పరిస్థితులను బట్టి బ్యాంకు గ్యారంటీల్లో కొంత వెసులుబాటు కల్పించే పరిస్థితి ఉంది. ఇదే అదునుగా ఏటా చివరి నిమిషం వరకు మిల్లర్లు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. మంగళవారం వరకు కేవలం ఐదుగురు మిల్లర్లే బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment