గురువారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2024
● పూర్తిస్థాయిలో ప్రారంభంకాని
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు
● ఇప్పటివరకు ఒక్క కొనుగోలు కేంద్రమే ఏర్పాటు
● మందకొడిగానే ధాన్యం సేకరణ
● ధాన్యంను కళ్లంలో ఉంచలేక
దళారులకు విక్రయించాల్సిన దుస్థితి
● తక్కువ ధరకే రైతుల శ్రమను దోచుకుంటున్న దళారులు
● ఆవేదనలో రైతాంగం
రైతన్నలు ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరి పంట చేతికొచ్చింది. కోతకోసి.. నూర్పిడి చేసి కళ్లంలో సిద్ధం చేసిన ధాన్యం విక్రయిద్దామంటే కొనుగోలు కేంద్రాలు లేవు. నిల్వచేసే చోటూ కరువే. తప్పనిసరి పరిస్థితుల్లో పంటను దళారులకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా దళారులు రైతు శ్రమను దోచుకుంటున్నారు. తేమ శాతాన్ని బూచిగా చూపించి తక్కువధరకే కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యం రైతుకు శాపంగా మారింది. దగాకు గురవుతున్నారు. కష్టమంతా దళారుల పాలవుతోందంటూ గగ్గోలు పెడుతున్నారు.
– సాక్షి, పార్వతీపురం మన్యం/గరుగుబిల్లి
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment