ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు, మిల్లర్లు గ్రామాల్లో వాలిపోతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ మద్దతు ధర ఏ–గ్రేడ్ 80 కిలోలు రూ.1,856, క్వింటా ధర రూ.2,320గా ఉంది. సాధారణ రకం 80కిలోల బస్తా రూ.1,840, క్వింటా రూ.2,300గా ప్రకటించారు. మిల్లర్లు, దళారులు తేమ శాతాన్ని సాకుగా చూపి తక్కువ ధరకు అడగడం.. అదనపు కిలోలు లెక్కగట్టడం వంటి చర్యలతో రైతుకు నష్టం కలిగిస్తున్నారు. పాలకొండ డివిజన్‌తోపాటు.. పార్వతీపురం డివిజన్‌లోని సీతానగరం, బలిజిపేట, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో సేకరిస్తున్న ధాన్యాన్ని గోదావరి జిల్లాలకు తరలిస్తున్నారు. మరోవైపు అధికారికంగా కొనుగోలు కేంద్రాలు లేకపోయినప్పటికీ.. స్థానిక మిల్లుల్లో ధాన్యం బస్తాలు పెద్ద ఎత్తున కనిపిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment